ఏపీ మినిస్టర్ అనీల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత చనిపోతే నారా లోకేష్ ఎందుకు పరామర్శించడానికి వెళ్లలేదని విమర్శించారు. లోకేష్‌ను టీడీపీ అధినేత చంద్రబాబే నమ్మడం లేదని, రాష్ట్రప్రజలు ఎలా నమ్ముతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు నీచమైన చిల్లర రాజకీయాలు మానుకోవాలని అన్నారు. లోకేష్ నాయకత్వం చూసి సొంతపార్టీ నేతలే భయపడుతున్నారని, రాష్ట్రప్రజల పరిస్థితి ఇంకెలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. బాబు వస్తే ఉద్యోగాలు వస్తాయని రాష్ట్రప్రజలను నమ్మించారని, కానీ, టీడీపీ పాలనలో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని అనీల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.
Read: దుమ్మురేపేద్దాం… పవన్ ఫ్యాన్స్ కు తమన్ ప్రామిస్