మహిళల భద్రతపై సీఎం వైయస్.జగన్ నిర్వహించిన అత్యున్నతస్థాయి సమావేశంలో పాల్గొన హోంమంత్రి సుచరిత అనంతరం మాట్లాడుతూ… దిశ యాప్ వినియోగం పై విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ యాప్ ఉంటే ఆపద సమయంలో బటన్ కూడా నొక్కాల్సిన అవసరం లేదు. ఫోను ను మూడు సార్లు కదిపితే దగ్గరలోని పోలీసులకు సమాచారం చేరుతుంది అన్నారు. నది ఒడ్డు మొత్తం సీసీ కెమెరాలు పెట్టడం సాధ్యం కాదు సీసీ కెమెరాల ఏర్పాటు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపారు. కనీసం స్నేహితులు, బంధువులకు అయినా సమాచారం ఇవ్వాలి అని పేర్కొన్నారు.