NTV Telugu Site icon

బీటెక్ విద్యార్దిని రమ్య కేసులో హోం మంత్రి కీలక వ్యాఖ్యలు…

గుంటూరులో బీటెక్‌ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ దుండగుడు విద్యార్థినిని కత్తితో పొడిచి చంపాడు. ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఆమె మూడ సంవత్సరం చదువుతోంది. అయితే… ఇవాళ ఉదయం ఒంటరిగా ఉన్న రమ్యను చూసి… కత్తితో దాడిచేసి హతమర్చాడు. అయితే.. ఈ ఘటన పై హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ… బీటెక్ విద్యార్దిని రమ్యను తెలిసిన వ్యక్తే హత్య చేశాడు. హత్యకు ముందు ఘర్షణ పడ్డారు. పరిచయం వున్న వ్యక్తే అయినా చంపే హక్కు ఎవరిచ్చారు అని ఆవిడ ప్రశ్నించారు. ఎన్ని చట్టాలు వచ్చిన నిందితుల్లో మార్పు రావడం లేదు. నిందితుడిని త్వరలో పట్టుకుంటాం. ముఖ్యమంత్రి రమ్య కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. దిశ చట్టం ద్వారా నిందితులకు ఉరిశిక్ష పడేలా చూస్తాం అని పేర్కొన్నారు.