పీఆర్సీపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. ప్రభుత్వం ఎప్పుడు పీఆర్సీ ప్రకటిస్తుందా? అని ఉద్యోగులు ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి.. అయితే, పీఆర్సీపై కసరత్తును ముమ్మరం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఫిట్‌మెంట్‌పై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్‌శర్మతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. 27 శాతం ఐఆర్ కంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. కాగా, పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఐఆర్ 27 శాతం ఇస్తున్నందున 14 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఐఆర్ ఇప్పటికే ఇస్తున్నందన.. కొత్తగా ఇస్తున్నది ఏంటో చెప్పాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం.. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లకే పోతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.
Read Also: స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణత్యాగాలొద్దు.. ఇది చేస్తే చాలు-పవన్ కల్యాణ్
