ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు సోమవారం (మే 10) అమెరికాలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న ప్రసాదరావుకు ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పిరావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఐదు రోజుల తర్వాత ప్రసాదరావు మృతదేహం హైదరాబాద్ కు చేరుకుంది. ప్రశాసన్ నగర్ లో ఉన్న ప్రసాద్ రావు ఇంటికి మృతదేహం చేరుకుంది. మరికాసేపట్లో అంత్యక్రియలు ఆయన జరగనున్నాయి.
మరికాసేపట్లో మాజీ డీజీపీ ప్రసాదరావు అంత్యక్రియలు
