Site icon NTV Telugu

వారి వేతనాలు పెంచడంపై డిప్యూటీ సీఎం అంజాద్ బాష హర్షం…

మతసమరస్యానికి మన రాష్ట్రం ప్రతీక. అర్చకులు, పాస్టర్లు, ఇమామ్, మౌజన్ ల వేతనాలు పెంచడంపై డిప్యూటీ సీఎం అంజాద్ బాష హర్షం వ్యక్తం చేసారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. సమాజంలో అర్చకులు,పాస్టర్లు, మౌజన్లు,ఇమామ్ లకు గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం. గతంలో వీరికి ఇచ్చే గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెంచి వారి ముఖాల్లో ఆనందం చూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు కూడా వేతనాలు పెంచారు. పాదయాత్ర లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు వీరి సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్. దేశంలో ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం. కరోనా మహమ్మరిని నిరోధించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కరోనా వ్యాధి నివారణకు ప్రజలు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం పై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధి లోనిది. ప్రజల్లో అభద్రతా భావం కలిగించేలా ప్రతిపక్ష పార్టీల ప్రయత్నాలు చేస్తున్నాయి అని పేర్కొన్నారు.

Exit mobile version