Site icon NTV Telugu

చంద్రబాబుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి సవాల్

తిరుపతి : చంద్రబాబుకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మరో సవాల్ విసిరారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. సమితి అధ్యక్షుడి నుంచి ఉప ముఖ్యమంత్రి హోదా వరకు నిజాయితీగా పనిచేశానన్న డిప్యూటీ సిఎం.. కృష్టాపురం, ఎన్టీఆర్ జలాశయాలు అభివృద్ధి చేయడానికి సిఎం జగన్ కోరానని తెలిపారు. జలాశయాల అభివృద్ధి సిఎం హామీ ఇచ్చారని… కుప్పం అభివృద్ధి చేస్తున్న ఘనత జగన్ అన్నదేనని వెల్లడించారు. కావాలంటే చంద్రబాబు… కుప్పం వెళ్ళి ప్రజలనే అడుగాలని తెలిపారు. అవీనీతి చేయలేదని తాను కాణిపాకంలో సత్య ప్రయాణం చేయడానికి సిద్దమన్నా నారాయణస్వామి…దీనికి చంద్రబాబు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. తన పై వచ్చిన ఆరోపణలపై కావాలంటే సిబిఐతో దర్యాప్తు చేయించుకోవచ్చని తెలిపారు.

Exit mobile version