ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి వుంది. ఈనెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇప్పటికే సైక్లోన్ కు చిత్రాంగ్ అని పేరు పెట్టారు. ఈ నెల 20నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఆంధ్రప్రదేశ్ వైపు పయనించనుంది. ఆ తర్వాత తుఫాన్ గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ ఏర్పడితే చిత్రాంగ్ గా నామకరణం చేయాలని నిర్ణయించారు. సూపర్ సైక్లోన్ అవకాశాలను గుర్తించిన గ్లోబల్ ఫో ర్ కాస్ట్ సిస్టమ్(జీ.ఎఫ్.ఎస్). సూపర్ సైక్లోన్ ఏర్పడితే ఏపీ, ఒడిషా,బెంగాల్ రాష్ట్రాలపైన ప్రభావం వుంటుందని భావిస్తున్నారు.
Ap Cyclone Sitrang Updates Live: ఏపీకి తుఫాన్ ముప్పు

Maxresdefault (1)
