Site icon NTV Telugu

జీతాల్లో కోత పడే అవకాశం లేదు.. సమీర్ శర్మ

ఏపీలో మళ్ళీ మొదటికొచ్చింది పీఆర్సీ సమస్య. పీఆర్సీ జీవోపై ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు సీఎస్ సమీర్ శర్మ. సీఎంను పక్కదారి పట్టించారంటూ సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీపై ఆరోపణలు గుప్పించిన ఉద్యోగ సంఘాలు. ఈనేపథ్యంలో సీఎస్‌ ఏం చెబుతారోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. కరోనాతో ఏపీ ఆదాయం బాగా తగ్గింది. ప్రస్తుతం రూ. 62 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. కరోనా లేకుంటే రూ. 90 వేల కోట్లకు పైగానే ఆదాయం వచ్చేది.

బడ్జెట్-పీఆర్సీని సమన్వయం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంది. పీఆర్సీ విషయంలో ప్రతి ఒక్క అంశం సీఎంకు తెలుసు. రూ. 17 వేల కోట్ల మేర ఐఆర్ ఇచ్చాం.ఐఆర్ అంటే జీతంలో భాగం కాదు.పీఆర్సీ వల్ల గ్రాస్ శాలరీలో ఏ మాత్రం తగ్గదు.హెచ్చార్ఏ తగ్గిందా..? పెరిగిందా..? అనేది వేరే అంశం. జీతాల్లో కోత మాత్రం పడే అవకాశమే లేదని వివరించారు సీఎస్ సమీర్ శర్మ.

ఐఏఎస్ ఆఫీసర్లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయని.. ఏదేదో అంటున్నారు.. ఇవన్నీ నిజం కాదు. గ్రాట్యుటీ పెరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఆర్సీని ఫాలో కానున్నాం. మెడికల్ అలవెన్స్ పెరిగింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు ఇప్పుడే పెంచుతున్నాం. గ్రాస్ శాలరీగా చూస్తే జీతంలో ఏ మాత్రం కోత పడదు.. పడే అవకామే లేదని స్పష్టం చేశారు సీఎస్ సమీర్ శర్మ.

రిటైర్మెంట్ వయస్సు పెంచాం. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు సీఎస్. 60 ఏళ్లు వచ్చినా ఫిట్ గా ఉండే పరిస్థితులు ఉన్నాయి.అలాంటప్పుడు వారి అనుభవాలను ఎందుకు ఉపయోగించుకోకూడదు. రిటైర్మెంట్ వయస్సు పెంచడం వల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతోందనేది కరెక్ట్ కాదు. ఉద్యోగాలు భర్తీ చేశాం.. చేస్తూనే ఉంటాం అని వివరించారు.

Exit mobile version