Site icon NTV Telugu

బెణికిన కాలు.. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన రద్దు..

YS Jagan

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హస్తిన పర్యటన రద్దు చేసుకున్నారు.. షెడ్యూల్‌ ప్రకారం.. షెడ్యూల్‌ ప్రకారం రేపు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సింది సీఎం జగన్‌.. ఎల్లుండి వామపక్ష తీవ్రవాదం పై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో జరగనున్న సమావేశానికి హాజరుకావాల్సి ఉంది.. కానీ, ఇవాళ ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్‌కు కాలు బెణికింది.. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలో రేపటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.

Exit mobile version