Montha Effect : కేంద్ర బృందం ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానుంది. నవంబర్ 10, 11 తేదీల్లో ‘మొంథా తుఫాన్’ ప్రభావిత జిల్లాల్లో నష్టాల స్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈ బృందం రెండు రోజుల పర్యటన చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసి, సంబంధిత వివరాలను కేంద్రానికి పంపింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన బృందం ఏర్పాటైంది.
Jagga Reddy: కేటీఆర్ మాటలు నమ్మకండి.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
బృందం రెండు భాగాలుగా విభజించబడింది. సోమవారం టీమ్-1 బాపట్ల జిల్లాలో పర్యటించగా, టీమ్–2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటన చేస్తుంది. మంగళవారం టీమ్-1 ప్రకాశం జిల్లాలో, టీమ్-2 కోనసీమ జిల్లాలో నష్టాలను పరిశీలించనుంది. ఈ పర్యటనలో అధికారులు క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాలను సమీక్షించడంతో పాటు తుఫాన్ బాధితులతో నేరుగా మాట్లాడుతూ పరిస్థితులను అంచనా వేయనున్నారు.
బృందంలో కీలక విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమశాఖలోని ఆయిల్ సీడ్స్ డెవలప్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాదు డైరెక్టర్ డా. కె. పొన్ను స్వామి, న్యూఢిల్లీలోని వ్యయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేష్ కుమార్, సెంట్రల్ వాటర్ కమిషన్ హైదరాబాదు డైరెక్టర్ శ్రీనివాసు బైరి, రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శశాంక్ శేఖర్ రాయ్, గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ మనోజ్ కుమార్ మీనా, విద్యుత్ శాఖ న్యూఢిల్లీలోని డిప్యూటీ డైరెక్టర్ ఆర్తి సింగ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాదుకు చెందిన సైంటిస్ట్-E సాయి భగీరథ్ ఈ బృందంలో ఉన్నారు.
Bihar Elections 2025: బీజేపీకి ఓటు వేశారనే అనుమానంతో.. దళిత కుటుంబంపై దాడి..
