Site icon NTV Telugu

నేడు సమావేశం కానున్న ఏపీ కేబినెట్…

ఇవాళ ఏపి కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశం కానుంది మంత్రి మండలి. పలు కీలక అంశాలపై చర్చించనుంది మంత్రి మండలి. రాష్ట్రంలో గుట్కా నిషేదానికి చట్ట సవరణపై చర్చించే అవకాశం ఉంది. ఫిలిమ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయ ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది. ఆన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్మ‌కాల‌కు ఆర్డినెన్స్ కు అమోదం తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు పై చ‌ర్చ‌ జరిగింది. అమ్మ ఒడి పథకం అమలు పై చర్చించే అవకాశం ఉంది. ఇంకా రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉన్నట్లు అలాగే సినిమాటోగ్ర‌ఫి చ‌ట్టానికి స‌వ‌ర‌ణకు అర్డినెన్స్ కు కేబినెట్ అమోదం తెలపనునట్లు తెలుస్తుంది.

ఇక వ‌చ్చే నెల‌లో అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించే ఆలోచనలో ప్ర‌భుత్వం… అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ పై చ‌ర్చించే అవకాశం ఉంది మరియు టీటీడీలో ప్ర‌త్యేక అహ్వానితుల నియామ‌కం పై చ‌ర్చ‌… ప్ర‌త్యేక అహ్వానితుల కోసం చ‌ట్ట‌స‌వ‌ర‌ణ‌… దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ‌… దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ ఏర్పాటు పై చ‌ర్చ‌… ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపుల పై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Exit mobile version