కడప జిల్లా : మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా…. ఉన్న దేవి రెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. దేవి రెడ్డి శంకర్ రెడ్డిని ఇవాళ మధ్యాహ్నం అదుపు లోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు.
హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని అదపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. దేవి రెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అనంతరం… కోఠి లోని సీబీఐ కార్యాలయానికి తరలించారు అధికారులు. ఇవాళ సాయంత్ర దేవి రెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి డ్రైవర్ దస్తగిరి లోంగిపోయిన సంగతి తెలిసిందే.
