ఏపీలోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. వేసవి ఉక్కపోతను తగ్గించుకొనేందుకు పెట్టిన ఏసీ ఆమె ప్రాణాలను తీసింది..ఎప్పటిలాగే ఏసీని ఆన్ చేసి తన కొడుకుతో నిద్రపోయింది.. అయితే హైవోల్టేజీ వల్ల ఏసీ పేలింది.. అందులో నుంచి విడుదలైన విష వాయువులను పీల్చడం వల్ల ఆమెకు ఈ పరిస్థితి వచ్చింది. ఆమె పక్కనే నిద్రపోతున్న కుమారుడు కూడా అస్వస్థతకు గురయ్యారు..ఈ ఘటనను గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.. కానీ పరిస్థితి విషమించడంతో వారిద్దరూ ప్రాణాలను వదిలేసారు.. తల్లీకొడుకు మరణించడంతో విషాదచాయాలు అలుముకున్నాయి.. ఈ ఘటన ఏపీ లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చీమకుర్తి ప్రాంతంలో 52 ఏళ్ల దామర్ల శ్రీదేవి అనే మహిళ తన కుమారుడు సాయితేజతో కలిసి ఓ ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె ఒంగోలు జిల్లా పరిషత్ ఆఫీసులో పీఎఫ్ సెక్షన్ లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు.. ఆమె భర్త ఆ ఉద్యోగం చేస్తూ మరణించడంతో ఆమెకు ఆ ఉద్యోగం వచ్చింది..చీమకుర్తి పట్టణంలోని పల్లపోతు వారి వీధిలో ఆమె నివాసం ఉంటూ విధులకు హాజరవుతూ ఉండేది..
ఎప్పటిలాగే తల్లికొడుకులు ఇద్దరు ఏసీ వేసుకొని నిద్రపోయారు.. ఇంట్లో హైవోల్టేజీ పవర్ రావడంతో ఏసీ పేలింది.ఘాడ నిద్రలో ఉన్న తల్లికొడుకులు ఏసీ నుంచి వెలువడిన విషవాయువులను పీల్చారు..స్థానికులు గమనించారు. వెంటనే ఆ ఇంటికి చేరుకొని అస్వస్థతకు గురైన తల్లీ కుమారులను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఇక అప్పటి నుంచి వారిద్దరూ ఒంగోలు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కానీ శ్రీదేవి పరిస్థితి విషమించింది… కొడుకు పరిస్థితి కూడా విషమించినట్లు వైద్యులు చెబుతున్నారు..