Site icon NTV Telugu

ఏపీ పొదుపు మంత్రం.. ఖర్చులు తగ్గించుకోవడంపై కసరత్తు..!

AP Govt

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పొదుపు మంత్రం పటిస్తోంది… ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకునే అంశంపై కసరత్తు చేస్తోంది… ఆదాయం తక్కువగా ఉండడంతో ఖర్చుల తగ్గించుకునే అంశంపై ఫోకస్‌ పెట్టారు అధికారులు.. పొదుపు పాటిస్తూనే.. ఆదాయం చేజారకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో కమిటీ నియమించింది సర్కార్.. సీఎస్‌ నేతృత్వంలో ఆర్థిక శాఖ, సీసీఎల్‌ఏ, జీఏడీ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు అయ్యింది… ప్రజలకు మెరుగైన సేవలందిస్తూనే పరిపాలనా పరంగా పొదుపు పాటించే అంశంపై కసరత్తు చేయనుంది ఈ కమిటీ… అనవసర ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవాలనే విషయమై సూచనలు చేయనుంది సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ.. పన్నుల ఎగవేత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు.. ఖర్చు తగ్గించుకునే అంశంపై ప్రతి శాఖలో జరుగుతున్న పరిణామాలను సమీక్షించనున్నారు.. మొత్తంగా ఖర్చు తగ్గించుకుంటూనే.. ఆదాయం రాబట్టే విధంగా కమిటీ కసరత్తు చేయనుంది.

Exit mobile version