NTV Telugu Site icon

CM Jagan: రేపు సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్

Cm Jagan

Cm Jagan

శ్రీసత్యసాయి జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆయన పర్యటన షెడ్యూల్‌ను వ్యక్తిగత కార్యదర్శి విడుదల చేశారు. మంగళవారం నాడు సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు 14వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి సీఎం జగన్ బయలుదేరుతారు. ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10:20 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చెన్నై కొత్తపల్లికి బయలుదేరి వెళ్తారు.

ఉదయం 10.50 గంటలకు చెన్నేకొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ 15 నిమిషాల పాటు స్థానిక వైసీపీ కార్యకర్తలు, నాయకులతో సీఎం జగన్ మాట్లాడతారు. అనంతరం సభాస్థలికి బయలుదేరి వెళ్తారు. ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. పంటల బీమా మెగా చెక్‌ను రైతులకు అందజేసి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తాడేపల్లికి సీఎం జగన్ తిరుగు ప్రయాణం అవుతారు. మధ్యాహ్నం 2:50 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

Tirumala: టీటీడీ ఖజానాకు రూ.1100 కోట్ల విరాళాలు