Site icon NTV Telugu

Andhra Pradesh: ఉపాధి హామీ పథకం ప్రారంభించిన చోటే నిరసన.. ఏపీకి సోనియా, రాహుల్‌, ఖర్గే..

Mgnrega Name Change Protes

Mgnrega Name Change Protes

Andhra Pradesh: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కాస్తా.. వికసిత్ భారత్ రోజ్‌గార్, వికసిత్ భారత్ రోజ్‌గార్, అజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G )గా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది కాంగ్రెస్‌ పార్టీ.. మరోవైపు, ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టిన ప్రాంతంలోనే భారీ నిరసన కార్యక్రమానికి చేపట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు సిద్ధం అవుతున్నారు.. దీని కోసం వచ్చే నెల ఆంధ్రప్రదేశ్‌కి రాబుతోన్నారు కాంగ్రెస్‌ అగ్రనేతలు..

Read Also: Dhurandhar: ఒకే రోజులో ఐదు రికార్డ్‌లు బ్రేక్ చేసిన ‘ధురంధర్’..

ఫిబ్రవరి 2న ఆంధ్రప్రదేశ్‌కి రానున్నారు కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లికి రానున్న కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం.. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం రద్దుకు వ్యతిరేకంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు.. అయితే, ఉపాధి హామీ పథకం (MGNREGA) జాతీయ స్థాయిలో 2005లో ప్రారంభమైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో 2006లో అనంతపురంలో ప్రారంభించారు.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. 2 ఫిబ్రవరి 2006లో ఈ కార్యక్రమానికి నిర్వహించగా.. కేంద్ర ప్రభుత్వం స్కీమ్‌ పేరును మార్పును నిరసిస్తూ.. 20 ఏళ్ల తర్వాత అదే రోజు అంటే 2 ఫిబ్రవరి 2026న అదే గ్రామంలో నిరసన కార్యక్రమం ఏర్పాటుకు సిద్ధమైంది కాంగ్రెస్‌ పార్టీ..

Exit mobile version