చంద్రబాబు పై మరోసారి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎందుకు వెక్కి వెక్కిఏడ్చారని..నిజమైన నాయకుడు ఏడవరంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని… లోకేష్ రాజకీయాలకు పనికిరాడంటూ చురకలు అంటించారు. ధీరుడికి మాత్రమే రాజ్యం ఏలే హక్కు ఉంటుందని.. చంద్రబాబుకు కుటుంబం ప్రధానం కాదు, ముఖ్యమంత్రి పదవే ప్రధానమన్నారు.
కుప్పంలోనే చంద్రబాబుకు దిక్కులేదని… ఇక అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తెలిపారు. ఓటీఎస్ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయని… గతంలో అగ్రవర్ణాలకు ప్రాధాన్యత ఉండేదన్నారు. సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు ఉన్నోళ్లకు డబ్బులు పంచితే… జగన్ పేదలకు డబ్బులు ఇస్తున్నారని కొనియడారు.
