Site icon NTV Telugu

CM Chandrababu: పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలి.. ఉద్యోగులపై పని భారం తగ్గించాలి..

Cbn

Cbn

CM Chandrababu: పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సమర్ధత లేకపోతే శిక్షణ ఇచ్చి, నిరంతరం పర్యవేక్షించాలని.. తద్వారా ఫలితాలు సాధించవచ్చన్నారు. సాంకేతికతతో గవర్నెన్స్‌లో చాలా సమస్యలు పరిష్కరించవచ్చని, సాంకేతికతను ఉద్యోగులు, అధికారులు విస్తృత స్థాయిలో వినియోగించుకునేలా ప్రోత్సహించేలా కోరారు. 2026 సంవత్సరం టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌గా మారాలని, ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. ఏఐ వినియోగించుకుని గ్రీవెన్స్‌లు సత్వరంగా పరిష్కరించాలని నిర్దేశించారు.

Read Also: కేవలం రూ.3,500కే గోవా టూర్..! TGSRTC అదిరిపోయే ఆఫర్.. మిస్ కావద్దు.!

క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇక డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు. మన మిత్ర – వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 ప్రభుత్వ సేవలను అందించగలుగుతున్నట్టు.. ఇప్పటివరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు.

Exit mobile version