NTV Telugu Site icon

Pawan Kalyan: హిందుత్వంపై పవన్ కల్యాణ్‌ ట్వీట్..

Pawan

Pawan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు.. ఇక, ఈ తరుణంలో ఆయన తిరుమలలో జరగుతోన్న వ్యవహారంపై అంతా నోరువిప్పాలని పిలుపునిచ్చారు.. మరోవైపు. తాజాగా ఆధ్యాత్మికత.. హిందుత్వంపై సోషల మీడియా వేదికగా.. ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ఓ పోస్టు పెట్టారు.. దేవాలయాలు, సైన్స్ మధ్య ఉన్న బంధాన్ని భారత దేశ చరిత్ర, దేశ సంస్కృతుల్లో కనపడుతూనే ఉంటాయన్న ఆయన.. ఆలయాలకు.. ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాల మధ్య సంబంధం స్ఫూర్తిదాయకంగా పేర్కొన్నారు.. వివిధ ప్రదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనల్ని అనుసంధానం చేస్తుందన్నారు.. దేవాలయాలు.. వాటి గోడలలో కూడా తరతరాలుగా జ్ఞానం నిక్షిప్తమై ఉందన్నారు.. సంస్కృతి, విజ్ఞానానికి కేంద్రాలుగా దేవాలయాలు భాసిల్లేవనే గుర్తుచేశారు.. దేవాలయాలు సైన్స్, ఆధ్యాత్మిక రంగాలను ఏకీకృతం చేసేవి.. అంతరాలను తగ్గించేవి అంటూ తన ట్విట్టర్‌ హ్యాడిల్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.