Pawan Kalyan Ippatam Visit: జనసేన చీఫ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇప్పటం పర్యటన ఖరారు అయ్యింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ రోజు అంటే మంగళవారం.. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామానికి పవన్ కల్యాణ్ వెళ్లాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. అయితే, పవన్ కల్యాణ్ ఇప్పటం పర్యటన ఖరారు చేశారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు అనగా బుధవారం రోజు ఉదయం 11 గంటలకు మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాన్ని సందర్శించనున్నారు. 2022లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో.. రోడ్ల వైండింగ్ పేరుతో ఇప్పటం గ్రామంలో పలువురు పేదల ఇళ్లను కూల్చివేయగా, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న పవన్ కల్యాణ్ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
Read Also: Climate Change: ఆ ఏడాది మహా వినాశనం.. ప్రకంపనలు రేపుతున్న సైంటిస్టుల ప్రకటన!
అయితే, ఆ సమయంలో పవన్ కల్యాణ్‌ను చూసి ‘నువ్వు నా కుమారుడివే’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఇండ్ల నాగేశ్వరమ్మను అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మళ్లీ వచ్చి కలుస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, రేపు స్వయంగా ఇండ్ల నాగేశ్వరమ్మను కలవనున్నారని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన రాజకీయంగా కాకుండా మానవీయ కోణంలో ప్రాధాన్యం సంతరించుకుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, ఇప్పటం గ్రామంలోని ఇండ్ల నాగేశ్వరమ్మను పవన్ కల్యాణ్ ఈ రోజు కలవాల్సి ఉంది.. కానీ, ఈ పర్యటన అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన వాయిదా పడడంతో.. రేపు పవన్ కల్యాణ్.. ఇప్పటం వస్తున్నారంటూ తాజాగా ప్రకటించాయి జనసేన పార్టీ వర్గాలు..
