Site icon NTV Telugu

Kandula Durgesh: కొత్త సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై మంత్రి కందుల దర్గేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Kandula Durgesh

Kandula Durgesh

Kandula Durgesh: కొత్త సినిమా విడుదల అయినప్పుడు అప్పటికప్పుడు టికెట్ ధరలు పెంచకుండా ఒక సమగ్ర విధానం అమలు చేస్తాం అన్నారు మంత్రి కందుల దుర్గేష్.. అటు సినిమా పరిశ్రమకు.. ఇటు సినీ ప్రేక్షకులకు న్యాయం జరిగేలా టికెట్ రేట్లు ఉండేలా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్ల కు సంబంధించి ప్రభుత్వం ఇవాళ సమావేశం నిర్వహించింది. సినిమా ప్రముఖులు… ప్రభుత్వ ఉన్నతాధికారులు తో సమావేశం నిర్వహించారు.. ప్రతి సారి కొత్త సినిమా విడుదల అయినప్పుడు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు. సినిమా టికెట్ రేట్లు పెరిగి.. సినిమాకు వెళ్లి పాప్ కార్న్ కనుక్కోవడం కూడా కష్టంగా మారిందన్నారు దర్శకుడు తేజ.

Read Also: MHSRB : మెరిట్ లిస్ట్ విడుదల.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.!

అయితే, ప్రతి సారి సినిమా టికెట్ రేట్లు పెంచడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అన్నారు దుర్గేష్.. టికెట్ రేట్లకు సంబంధించి ఒకే జీవో ఉండేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.. పెద్ద బడ్జెట్ సినిమా… ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ కు సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం అన్నారు.. డిస్ట్రిబ్యూటర్.. నిర్మాతలతో సమావేశం నిర్వహిస్తున్నాం. సినిమా పరిశ్రమ సమస్యలు కూడా విని పరిష్కారం చూపిస్తాం.. తెలుగు సినిమా పాన్ వరల్డ్ అయింది. వేల కోట్ల బడ్జెట్ అవుతోంది.. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్‌..

Exit mobile version