NTV Telugu Site icon

AP Capital Amaravati: రాజధాని నిర్మాణంలో కీలక అడుగులు..! నేడు అమరావతికి ఐఐటీ నిపుణులు..

Amaravati

Amaravati

AP Capital Amaravati: రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో కీలక అడుగులు పడబోతున్నాయి. ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన చర్యలకు ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టగా.. ఇవాళ ఆ దిశగా కొన్ని కీలక అడుగులు పడుతున్నాయి. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు రాష్ట్రానికి రానున్నారు. 2019 కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా.. మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలని దానిపై ఐఐటీ ఇంజినీర్లతో అధ్యయనం చేయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 2019కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన వాటి స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు రాష్ట్రానికి రానున్నారు.

Read Also: Viral Video: 3 నెలల క్రితం తప్పిపోయిన మహిళ గుహలో నాగినిలా ప్రత్యక్షం.. పూజలు చేస్తున్న స్థానికులు

ఆయా నిర్మాణాల పటిష్టత, ఇతర టెక్నికల్ అంశాలను ఐఐటీ ఇంజినీర్లు పరిశీలించనున్నారు. సెక్రటేరియట్, హెచ్‌వోడీ కార్యాలయాల టవర్లతో పాటు హై కోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా నాటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. దీనికోసం భారీ ఫౌండేషన్లతో పునాదులు కూడా వేసింది. అయితే పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు ఆగిపోయాయి. ఈ భవనాల ఫౌండేషన్ సామర్ధ్యాన్ని పరిశీలించే బాధ్యతను ఐఐటీ మద్రాస్ కు అప్పగించింది ప్రభుత్వం. ఇక, ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది ప్రభుత్వం. ఐఐటీ మద్రాస్,ఐఐటీ హైదరాబాద్ ల నుంచి ఇద్దరేసి ఇంజినీర్ల బృందాలు అమరావతికి రానున్నాయి. రెండు బృందాలు రెండు రోజులపాటు అమరావతిలో పర్యటించి ఆయా కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత, సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి. అమరావతి పర్యటనలో భాగంగా సీఆర్డీయే అధికారులతో రెండు బృందాల్లోని ఇంజినీర్లు విడివిడిగా సమావేశం కానున్నారు.

Show comments