MP Lavu Sri Krishna Devarayalu: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కీలక పోస్టు దక్కించుకున్నారు.. భారత ఆహార సంస్థ (FCI) కమిటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్‌గా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును FCI కమిటీ ఏపీ చైర్మన్‌గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. ఇక, FCI కమిటీ AP చైర్మన్ గా రాష్ట్రంలో పర్యటించి, ఆహార, ధాన్యం సేకరణ, కొనుగోలు, ఇతర పంటల ఉత్పత్తులు, ఆహార పదార్థాల నాణ్యతతో సహా, పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. ఇక, తనకు FCI కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.. తనపై బాధ్యతతో ఈ పదవి కట్టబెట్టిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.
Read Also: BJP MP: ‘‘భారత్ తమ దేశాన్ని విభజిస్తుందని పాకిస్తాన్ భయం’’.. బలూచిస్తాన్‌పై నిషికాంత్ దూబే..
