Site icon NTV Telugu

At Home Programme at AP Lok Bhavan: ఏపీ లోక్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం.. ఫొటోలు

At Home Programme At Ap Lok

At Home Programme At Ap Lok

At Home Programme at AP Lok Bhavan: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ లోక్ భవన్‌లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి హాజరుకాగా.. పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన సతీమణి అన్నా కొణెదల కూడా ఈ తేనీటి విందులో పాల్గొన్నారు. ఇక, ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. మంత్రులు నారా లోకేష్, సవిత, అచ్చం నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, రామ్ ప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర.. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. ఈశ్వరయ్య.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సహా తదితరులు హాజరయ్యారు.

అతిథులతో మమేకమై గవర్నర్ అబ్దుల్ నజీర్ అభివాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ప్రాముఖ్యతపై నేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Exit mobile version