Site icon NTV Telugu

APSRTC Rental Bus Owners Strike Call Off: ఏపీఎస్‌ఆర్టీసీలో సమ్మెకు తెర..

Apsrtc

Apsrtc

APSRTC Rental Bus Owners Strike Call Off: ఏపీఎస్ఆర్టీసీలో  ప్రస్తుతం 2,700 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో దూర ప్రాంత సర్వీసులు కాకుండా… స్త్రీశక్తి పథకం అమలవుతున్న పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు 2,419 ఉన్నాయి.  గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిందని, దీనివల్ల డిజిల్‌ ఎక్కువగా వినియోగించాల్సి వస్తోందని, టైర్ల అరుగుదల ఎక్కువగా ఉందని, బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల యజమానులు చెబుతున్నారు. అదనపు భారం పడుతున్నందున.. నెలకు ఒక్కో బస్‌కు 15 వేల నుంచి 20 వేలు అదనంగా ఇవ్వాలని ఆర్టీసీ అధికారులను కొంత కాలంగా  కోరుతున్నారు. ఒక్కో బస్‌కు నెలకు 5,200 అదనంగా  ఇచ్చేలా జారీ చేసిన సర్క్యులర్‌ పై అద్దె బస్సుల యజమానుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Read Also: Pakiatan: ‘‘ నెతన్యాహూను కిడ్నాప్ చేయండి’’.. ట్రంప్‌ను కోరిన పాకిస్తాన్..

మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి ని కలసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.. ఎండీ ద్వారకాతిరుమల రావుతో, ఏపీఎస్ఆర్టీసీ ఈడీలతో చర్చల అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు… మొత్తం నాలుగు అంశాలపై స్పష్టత రావాల్సి ఉండగా, వాటిపై ఈనెల 20 నాటికి పరిష్కారం చూపుతామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ హామీ ఇవ్వడంతో తమ సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.. స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్నప్పటి నుంచి బస్సుల్లో ఓవర్‌లోడింగ్‌ ప్రభావం ఎక్కువగా ఉంటోందని, అనేక చోట్ల బస్సులు ఆపాల్సి రావడంతో, ఆలస్యమైతే జరిమానాలు వేస్తున్నారన్న ఆవేదన పైనా ఎండీ సమాధానంతో అంగీకరించామని తెలిపారు.

ఆకస్మికంగా ఒక సర్క్యులర్ జారీ చేసిన సర్క్యులర్ పై పునరాలోచిస్తామని ఎండీ తెలిపారని, అయితే.. జనవరి 20 నాటికి ఒక పరిష్కారం ఇస్తామనడంతో, పండుగను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమిస్తున్నామని, బస్సుల కొరత ఉండదని అద్దె బస్సుల యజమానుల యూనియన్లు తెలిపాయి.. మేం అడిగిన దానికంటే మేం ఊహించని విధంగా 5200 అద్దె పెంచుతూ ఇచ్చిన సర్క్యులర్ పై మరోసారి ఆలోచిస్తామని తెలిపారన్నారు‌.. ఇన్సూరెన్స్ విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకుంటామని, ఇబ్వంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.. కేఎంపీఎల్‌ రేటు పెంచమని అడిగాం.. మైలేజీ పెంచాలని అడిగామని తెలిపారు‌.. మొత్తంగా ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి బస్సులకు అద్ధె కష్టాలు రాకుండా, అద్దె బస్సుల యజమానులు సమ్మె విరమించారు.

Exit mobile version