AP IAS Transfers 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రంలో 22 మంది IAS అధికారులకు బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటకం, విద్య, రవాణా, ఆరోగ్యం, హౌసింగ్, విపత్తు నిర్వహణ, పుష్కరాల నిర్వహణ, టీటీడీ, మున్సిపల్ పరిపాలన వంటి కీలక విభాగాల్లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ బదిలీల్లో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎస్.ఎస్. రావత్‌ను నియమించగా, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జె. శ్యామలరావును బదిలీ చేశారు. రవాణా, రోడ్లు–భవనాల శాఖ కార్యదర్శిగా కోనా శశిధర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆమ్రపాలికి పోస్టింగ్ లేదు.. GADకు రిపోర్ట్ ఆదేశాలు
ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆమ్రపాలిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం కొత్త పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖ (GAD)కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆమ్రపాలి స్థానంలో పట్టంశెట్టి రవి సుభాష్‌ను ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. అదనంగా APPSCలో CEO, సెక్రటరీ పోస్టులకు కూడా ఆయనకు FAC బాధ్యతలు అప్పగించారు.
తిరుపతిలో కీలక మార్పులు
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎం. జయకృష్ణను కొత్త కమిషనర్‌గా నియమించారు. టీటీడీలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విభాగానికి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రిటైర్డ్ IAS అధికారి డా. ఎ. శరత్ కొనసాగుతుండగా, అదే విభాగానికి ప్రభల గోపీనాథ్‌ను కూడా జాయింట్ ఈవోగా నియమించారు.
పుష్కరాలు, ఆరోగ్యం, హౌసింగ్ శాఖల్లో నియామకాలు
గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా సురేష్ కుమార్, జాయింట్ స్పెషల్ ఆఫీసర్‌గా నారాయణ భరత్ గుప్తా నియమితులయ్యారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌గా కేవీఎన్ చక్రధర బాబుకు FAC బాధ్యతలు అప్పగించారు. హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హెప్సిబా రాణి కొర్లపాటి నియమితులయ్యారు.
IAS అధికారుల బదిలీలు
1. ఎస్.ఎస్. రావత్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
2. జె. శ్యామలరావు – పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
3. కోనా శశిధర్ – రవాణా, రోడ్లు–భవనాల శాఖ కార్యదర్శి
4. ఎం. శివ ప్రసాద్ (IFS) – APSRTC జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
5. ఆమ్రపాలి కాటా- GADకు రిపోర్ట్ చేయాలి (పోస్టింగ్ పెండింగ్)
6. పట్టంశెట్టి రవి సుభాష్ – APTDC మేనేజింగ్ డైరెక్టర్, APPSC CEO & Secretary (FAC)
7. సురేష్ కుమార్ – గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి
8. నారాయణ భరత్ గుప్తా – గోదావరి పుష్కరాల జాయింట్ స్పెషల్ ఆఫీసర్
9. ముత్యాలరాజు రేవు – పురావస్తు, మ్యూజియంల కమిషనర్
10. కేవీఎన్ చక్రధర బాబు- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, NHM MD (FAC)
11. రాణి కొర్లపాటి – హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, AP Housing Corporation VC & MD (FAC)
12. పి. అరుణ్ బాబు – డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్
13. ఎన్. తేజ్ భరత్ – VMRDA కమిషనర్ బాధ్యతల నుంచి రిలీవ్
14. ప్రఖర్ జైన్ – VMRDA కమిషనర్
15. గీతాంజలి శర్మ – AP State Fibernet MD (FAC)
16. చేతన్ – టి.ఎస్. డైరెక్టర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (FAC)
17. డా. ఎ. శరత్ (రిటైర్డ్ IAS)- టీటీడీ జాయింట్ ఈవో (హెల్త్ & ఎడ్యుకేషన్) కొనసాగింపు
18. ప్రభల గోపీనాథ్ – టీటీడీ జాయింట్ ఈవో (హెల్త్ & ఎడ్యుకేషన్)
19. ఎ.ఎ.ఎల్. పద్మావతి- NTR వైద్య సేవా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (FAC)
20. ఎం. జయకృష్ణ – తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
21. బి. అనిల్ కుమార్ రెడ్డి – AP స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ MD బాధ్యతల నుంచి రిలీవ్
22. బి. సునీల్ కుమార్ రెడ్డి (IFS) – AP స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (FAC)

