Site icon NTV Telugu

Andhra Pradesh: రూ.20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 56,278 కొత్త ఉద్యోగాలు..!

Cbn

Cbn

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50 శాతానికి పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, 45 రోజుల్లోగా వీటికి శంకుస్థాపన జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది. ఇందులో 20,444 కోట్ల విలువైన పెట్టుబడులకు 13వ ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. దీంతో 56,278 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న 6 కంపెనీలకు కూడా ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. అలాగే విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలపై సీఎం సమీక్షించారు.

Read Also: Without Kohli In Cricket: కోహ్లీ లేకుండా వన్డే క్రికెట్ శూన్యం.. మహ్మద్ కైఫ్ సంచలన పోస్ట్

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని చూసే ప్రముఖ సంస్థలు పెద్దఎత్తున ఏపీకి వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు.. కంపెనీలు స్థాపించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం అన్నారు.. ఆయా కంపెనీలకు అవసరమైన నీరు, విద్యుత్, భూమి వంటి సౌకర్యాలను కల్పిస్తున్నాం. వాటి విషయంలో పారదర్శకత పాటిస్తుండడం వల్లనే ప్రాజెక్టులు ఏపీకి వస్తున్నాయన్నారు. గత పాలకులు సింగపూర్ లాంటి దేశాన్నే ఇబ్బందులు పెట్టారని… ఆ దేశ కంపెనీలను ఇబ్బంది పెట్టారన్నారు. . అలాంటి పరిస్థితులుంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావన్నారు. అంతర్జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తుందని… మనం ఆ బ్యాడ్ ఇమేజ్ ని చెరిపేసి… ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చాం అన్నారు చంద్రబాబు… అందుకే ఇటీవల మనం నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు మంచి స్పందన వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు.

20 రోజుల క్రితం విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తే… ఇప్పటికే రూ.7.69 కోట్ల విలువైన ఒప్పందాలు ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. ఈ ఎంవోయూలు అన్నింటికీ ఏయే జిల్లాల్లో ఏర్పాటు చేయాలి.. ఎక్కడెక్కడ భూములివ్వాలనే అంశంపైనా నిర్ణయాలు జరిగాయన్నారు. ఇక మిగిలిన ఎంవోయూలను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని.. 45 రోజుల్లోగా ఎంవోయూలు అన్నింటినీ గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు.. వీలైనన్ని ఎంవోయూలను గ్రౌండింగ్ చేసి… దావోస్ సదస్సుకు వెళ్తే మరిన్ని పెట్టుబడులను వస్తాయి. త్వరితగతిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలని… దావోస్ పర్యటనకు ముందే 75 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన జరిగేలా సీఎం దృష్టి పెట్టమన్నారని మంత్రి భరత్ తెలిపారు….

ఎంవోయూల గ్రౌండింగ్‌పై ప్రతీ వారం సీఎస్ సమీక్షించాలన్నారు సీఎం చంద్రబాబు.. ఇక నుంచి ఎస్ఐపీబీతో పాటు ఎంఓయూలపైనా తానే స్వయంగా సమీక్షిస్తానన్నారు. జిల్లా కలెక్టర్లు కూడా వీటిపై దృష్టి పెట్టాలని.. ఇక పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యే విధానానికి సంబంధించి ఓ విధానాన్ని రూపొందించాలన్నారు సీఎం చంద్రబాబు.. ఆమోదం పొందిన యూనిట్లు, పరిశ్రమలు నిర్దేశిత గడువులోగా ఏర్పాటు చేయాల్సిందేనని.. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలన్నారు చంద్రబాబు. వివిధ రంగాల్లో ఏపీని అభివృద్ధి చేయాలని చూస్తున్నాం అన్నారు… అలాగే రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నాం అని వెల్లడించారు.. ఈక్రమంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా టెక్నాలజీపై గ్రిప్ పెంచుకోవాలన్నారు.. లేకుంటే వెనుకబడిపోతాం అన్నారు సీఎం చంద్రబాబు.

Exit mobile version