AP Drought Mandals 2026: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా పడిందే లేదు.. దీంతో, చాలా మండలాలు కరువు బారిన పడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో మొత్తం 388 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించింది. వీటిలో 288 మండలాల్లో కరువు తీవ్రత అధికంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఉపశమనం కల్పించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్..
జిల్లాల వారీగా చూస్తే శ్రీ సత్యసాయి జిల్లాలో అత్యధికంగా 28 మండలాలు, నంద్యాల జిల్లాలో 26 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారు. అలాగే అన్నమయ్య, చిత్తూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఖరీఫ్ పంటలపై కరువు ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే, కరువు మండలాల్లో రైతులకు రుణాల రీషెడ్యూల్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. రైతులకు పంట నష్టం, నీటి కొరత వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది.

