Site icon NTV Telugu

Andhra Pradesh: సీఎస్ సర్వీసు పొడిగింపుపై సీఎం కీలక నిర్ణయం…

Cs Vijayanand

Cs Vijayanand

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సర్వీసును మరో మూడు నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సర్వీస్ పొడిగింపుతో విజయానంద్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. ఇక, మూడు నెలల తర్వాత ప్రస్తుత స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్‌కు సీఎస్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పదవీ కాలం 2026 మే వరకు ఉండడంతో, ఆ తర్వాత కూడా సీఎస్‌గా కొనసాగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులకు ప్రభుత్వ స్థాయిలో సమాచారం వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది.

Read Also: YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. తొలి దర్యాప్తు అధికారి డిస్మిస్..

Exit mobile version