Site icon NTV Telugu

AP TET Results: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల..

Ap Tet Results

Ap Tet Results

AP TET Results: ఆంధ్రప్రదేశ్‌ లో టెట్‌ (టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి.. ఏపీ టెట్‌ గతేడాది డిసెంబర్‌ 10 నుంచి 21 వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన తుది ఫలితాలు ఈ రోజు ప్రకటించారు.. టెట్‌కు మొత్తం అభ్యర్థులు 2,48,427 హాజరు కాగా.. ఈ రోజు వెలువడిన ఫలితాల్లో 97,560 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.. ఇక, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా తప్పనిసరి అనే చర్చ సాగుతోన్న తరుణంలో.. ఇన్‌ సర్వీస్ టీచర్లు కూడా టెట్‌ రాశారు.. ఇన్-సర్వీస్ (పని చేస్తున్న టీచర్లు) విభాగంలో 31,886 మంది పరీక్షలు రాయగా.. అర్హత పొందిన అభ్యర్థుల సంఖ్య 15,239గా ఉంది.. అంటే, ఇన్-సర్వీస్ అభ్యర్థులలో 47 శాతం పైగా టెస్ట్‌లో అర్హత సాధించారు.

Read Also: Iran Protests: ఖమేనీ ఫోటోలతో సిగరేట్ వెలిగిస్తున్న ఇరాన్ మహిళలు.. వీడియోలు వైరల్..

ప్రాథమిక కీలు విడుదలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత కన్వీనర్ అధికారికంగా తుది ఫలితాలను వెలువరించారు. అభ్యర్థులకు ఇప్పుడు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేసే అవకాశం ఉంది. కాగా, AP TET 2025–26 పోటీ పరీక్షలు డిసెంబర్‌ 10 నుంచి 21వ రోజు వరకూ నిర్వహించబడ్డాయి. తెలంగాణలో టీచర్ అర్హత పరీక్షలకు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం హాజరు అవుతుంటారు, మరియు ఏపీ ప్రశ్న పరీక్షల ప్రాముఖ్యత ఎప్పుడూ ఉన్నదే.

Exit mobile version