Site icon NTV Telugu

Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న ఏపీ సర్కార్..

Cbn

Cbn

Union Budget 2026: బడ్జెట్‌ 2026-27కు సిద్ధమైంది ఎన్డీఏ సర్కార్.. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ పై ఇప్పటికే ఫోకస్ పెట్టారు. రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల తో సమావేశం కూడా నిర్వహించారు.. ఏపీకి కేంద్ర బడ్జెట్ నుంచి వచ్చే నిధులు… వివిధ పథకాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులకు, అధికారులకు సూచించారు.. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృ ద్ధికి అవసరమైన ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ కసరత్తులో భాగంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం నిర్వహించారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏప్రిల్ 1 నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి రానున్నాయి. దీంతో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల పంపిణీ వాటాను పెంచాలని కోరారు.

రాష్ట్రాలు చేసే మూలధన వ్యయానికి కేంద్ర ప్రభుత్వం సాస్కీ కింద వడ్డీ లేని రుణాలు ఇవ్వడం హర్షణీయమని… ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఇది చాలా మేలు చేస్తోందన్నారు. పయ్యావుల.. ఈ పథకాన్ని 2026-27 లోనూ కొనసా గించాలని.. కేటాయింపులూ పెంచాలన్నారు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పూర్వోదయ పథకం కింద విద్య, వైద్యం, వ్యవసాయం, జీవ నోపాధులకు ప్రాధాన్యం ఇవ్వాలని స్థానిక ఆర్ధిక, పరిపాలనా అవసరాలకు తగ్గట్టు అందులో మార్పుచేర్పులు చేసుకొనే వెసులుబాటు కల్పించాలన్నారు పయ్యావుల.. ఇక, కేంద్రం ఏపీ విభజన చట్టంలో సెక్షన్స్ ప్రకారం. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పిందని.. ఈ నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.41 వేల కోట్లతో సమర్పించిన ప్రణాళికను పరిగణనలోకి తీసుకొని నిధులివ్వాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.. ఈ బడ్జెట్లో విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ జీడీపీని ప్రస్తుతం ఉన్న 52 బిలియన్ డాలర్ల నుంచి 2032 నాటికి 125 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడానికి 110-120 బిలియన్ డాలర్ల పెట్టు బడులు అవసరమని.. ఇందులో 85 శాతం పెట్టుబడులు ప్రైవేటు రంగం నుంచి రాబోతున్నాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది… మిగిలిన 15 శాతం పెట్టుబడులను ప్రభుత్వ రంగం ద్వారా సమకూర్చాలిని.. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్‌లో మౌలిక వసతుల కల్పనకు 2026-27లో రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది..

అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు సమకూర్చడానికి గత ఏడాది కేంద్ర ప్రభుత్వం సహకరించిందని.. రానున్న బడ్జెట్‌లోనూ రాజధానికి రెండో విడత గ్రాంట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. పోలవరం నుంచి రాష్ట్రంలో కరవు ప్రాంతాలకు 200 టీఎంసీల నీరు తరలించడానికి ఉద్దేశించిన పోలవరం – నల్లమలసాగర్‌కు రూ. 58,700 కోట్ల ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఇదివరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని 11 నదులను అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు కేటాయించిందని… అలాగే ఏపీ తలపెట్టిన ఈ నదీ అను సంధాన ప్రాజెక్టుకూ వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.. భారత వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను… ప్రధాన భాగస్వామిగా.. తయారుచేయాలని ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది.. అందుకు అవసరమైన ఆర్ధిక వనరులను కేంద్రం సమకూర్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.

మంత్రులు, కార్యదర్శిల మీటింగ్ లో కేంద్ర నిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకవడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కార్యదర్శులు అందరూ వారివారి శాఖల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు ఎందుకు ఖర్చుచేయడం లేదని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. ఈనెల 15 డెడ్ లైన్ అని చెప్పినా ఎందుకు ఖర్చుచేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.. మీకు ప్రజల సోమ్ము మురిగిపోయేలా చేసే హక్కు ఎవరిచ్చారని సీఎం ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి మొదటి, రెండవ వారాల్లో పెట్టి మార్చి 15కల్లా అంతా ముగించాలనుకుంటున్నానాని.. మార్చి 15 నుండి సెక్రటరీలు ఢిల్లీ వెళ్లి నిధులపై దృష్టి పెట్టాలన్నారు. ఇలా, అయితే వారానికి ఒకసారి మీటింగ్ పెట్టాలా అని అధికారులను ప్రశ్నించారు సీఎం చంద్రబాబు.. అందరు మంత్రులు కూడా ఆలోచించాలని సెక్రటరీలు, హెచ్‌వోడీలు ఆలోచించాలన్నారు.. ఈనెలాఖరుకు కేంద్ర పథకాల డబ్బులు ఖర్చుచేసి, మార్చి నాటికి అందరూ ఢిల్లీ వెళ్లి ఆయా శాఖల నిధులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఒక వైపు కేంద్ర బడ్జెట్.. మరో వైపు కేంద్రం నుంచి వచ్చే వివిధ పథకాల నిధులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది..

Exit mobile version