Rampachodavaram: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చిన్న బేరంపల్లి హైవే రూట్ లో గంజాయి వాహనం అదుపు తప్పింది. బీరంపల్లి డైవర్షన్ రూట్ దగ్గర ప్రమాదం జరిగినట్లు స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రమాదానికి గురైన కారులో గంజాయి బస్తాలు కనిపించడంతో.. గంజాయి బస్తాలను ఆటోలో వేసి రంపచోడవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక, కారులో దొరికిన గంజాయి సుమారు 200 కేజీలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు రంపచోడవరం పోలీసులు.
Read Also: Boycott IND vs PAK: సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగ్లోకి బాయ్‌కాట్ భారత్- పాక్ మ్యాచ్
ఇక, రంపచోడవరంలో కారు బోల్తా పడటంతో లభించిన గంజాయి బహిరంగ మార్కెట్లో దీని విలువ 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయితో ఉన్న కారు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లుతుంది?.. ఈ కారు ఎవరిది? అనే వివరాలను పోలీసులు విచారణలో సేకరిస్తున్నారు.
