Cinema Politics in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సినిమా రంగానికి ఎంత కాదనుకున్నా విడదీయలేని అవినాభావ సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. గతంలో సినీ రంగానికి చెందిన ఎన్టీఆర్ వంటి వారు రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లారు. ఆ తర్వాత కూడా సినీ నటులు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి సేవ చేసే ప్రయత్నం చేశారు. అందులో కొంతమంది సఫలం అయితే మరికొంతమంది ఇది మనకు కరెక్ట్ కాదని వెనక్కి వెళ్లిపోయారు. ఆ సంగతి పక్కన పెడితే 2024 సార్వత్రిక ఎన్నికలు మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లో కచ్చితంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా సినీ వర్గాల వారు ఈ రాజకీయ వర్గాలకు మద్దతు పలుకుతున్న తీరు ముఖ్యంగా చర్చనీయాంశం అవుతుంది. వెంకటేష్ లాంటి హీరో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరి ఆంధ్రకి వచ్చి బిజెపి అభ్యర్థిని గెలిపించాలని కోరడం చర్చనీయాంశమైంది.
Pawan kalyan: కాలికి గాయం.. నడవలేకపోతున్న పవన్ కళ్యాణ్!!
ఇక ఇప్పుడు అదే విధంగా అల్లు అర్జున్ వైసీపీలో ఉన్న తన స్నేహితుడిని గెలిపించాలని ఏకంగా అతని ఇంటికి వెళ్లి మద్దతు పలకడం మరింత హాట్ టాపిక్ అయింది. అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అల్లు అర్జున్ ఏ రోజైతే నంద్యాల వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారో అదే రోజు ఆయన తండ్రి అల్లు అరవింద్ మాత్రం పవన్ కళ్యాణ్ కి మద్దతు పలికేందుకు పిఠాపురం వెళ్లారు. తన మేనల్లుడు రామ్ చరణ్ తన సోదరి సురేఖతో కలిసి పవన్ నివాసానికి అల్లు అరవింద్ కూడా వెళ్లిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో తండ్రి జనసేన కోసం పిఠాపురం వెళితే కొడుకు వైసిపి ఫ్రెండ్ కోసం నంద్యాల వెళ్ళాడే, భలే ఆసక్తికరమైన రాజకీయం జరుగుతోంది అని చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది.