విజయవాడ నుంచి బెంగళూరుకు ఫ్లైట్ కు తప్పిన పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. టేకాఫ్ కు ముందే ఈ సంఘటన జరగడంతో అంతా సిబ్బంది అంతా అలర్టై ఒక్కసారిగా విమానాన్ని నిలిపివేశారు. టేకాఫ్ కు ముందే ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుండి బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం పక్షి ఢీకొనడంతో రద్దు చేయబడింది. విమానం టేకాఫ్ కోసం రన్‌వేపై ప్రయాణిస్తుండగా ఒక గద్ద విమానం ముందు భాగాన్ని ఢీకొట్టిందని ఎయిర్‌లైన్ అధికారి గురువారం తెలిపారు. విమానయాన సంస్థ విమానాన్ని రద్దు చేసి, ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. టేకాఫ్‌కు ముందు పక్షి ఢీకొట్టిందని, విమానం రన్‌వేపై ప్రయాణిస్తున్నప్పుడు ఇది జరిగిందని అధికారి వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. ప్రయాణీకులకు, సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదని.. ఎయిర్ పోర్ట్ సిబ్బంది వెల్లడించారు.
