A Man Recorded Woman Changing Clothes In His Mobile In Konaseema: తమకు జన్మనిచ్చింది ఓ మహిళేనన్న సంగతి మర్చిపోయి.. ఇతర అమ్మాయిల పట్ల కొందరు మృగాళ్లుగా వ్యవహరిస్తున్నారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటనలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ కాంట్రాక్టు ఉద్యోగి పాడుపని చేసి, అడ్డంగా బుక్కయ్యాడు. ఓ గదిలో యువతులు దుస్తులు మార్చుకుంటుండగా.. సెల్‌ఫోన్‌లో రహస్యంగా వారి దృశ్యాల్ని బంధించే ప్రయత్నం చేశాడు. చివరికి అతని బాగోతం బయటపడటంతో.. అతడ్ని పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఫేస్‌బుక్‌లో పరిచయమైన స్నేహితులందరు కలిసి.. ఈనెల 20వ తేదీన కార్తిక మాసం సందర్భంగా కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద వన సమారాధన ఏర్పాటు చేసుకున్నారు. వీళ్లలో కొందరు దూరపు ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి.. యువతులు దుస్తులు మార్చుకునేందుకు లొల్లలాకులలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని అధికారుల అనుమతితో తీసుకున్నారు. అయితే.. ఆ కార్యాలయంలో పనిచేసే ఒక కాంట్రాక్టు సిబ్బంది ఒకరు, ఆ రూమ్‌లో సీక్రెట్‌గా సెల్‌ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసి, ఎవరికీ కనిపించకుండా పెట్టాడు. యువతులు ఆ రూమ్‌లోకి దుస్తులు మార్చుకోవడానికి వస్తారని తెలుసుకొని, ఆ దృశ్యాల్ని రికార్డ్ చేయాలన్న ఉద్దేశంతోనే సెల్‌ఫోన్‌ని ఆ రూమ్‌లో అమర్చాడు.
తొలుత ఇద్దరు యువతులు ఆ రూమ్‌లోకి వెళ్లి, దుస్తులు మార్చుకొని వచ్చారు. అయితే.. మూడో అమ్మాయి ఆ సెల్‌ఫోన్‌ని చూసింది. లోపలికి వెళ్లిన తర్వాత దుస్తులు మార్చుకుంటున్న సమయంలో, ఆ అమ్మాయికి ఆ ఫోన్ కనిపించింది. దీంతో షాక్‌కి గురైన ఆ అమ్మాయి, విషయాన్ని తన స్నేహితులకి చెప్పింది. ఆ సెల్‌ఫోన్ ఎవరిదని ఆరా తీయగా.. అక్కడ పనిచేస్తున్న వ్యక్తిదే అని తేలింది. ఇంకేముంది.. అతడ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే.. ఆ స్నేహితులు తమ కేసుని విరమించుకోవడంతో, ఆ ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు వదిలేశారు.
