A Man Betrayed His Lover After Gender Operation In Bejawada: బెజవాడలో ఒక వింత ప్రేమకథ చోటు చేసుకుంది. ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డ మరో వ్యక్తి.. అతని కోసం ట్రాన్స్‌జెండర్‌గా మారాడు. పెళ్లి చేసుకొని అతనితో హ్యాపీగా దాంపత్య జీవితాన్ని గడపాలని అనుకున్నాడు. తీరా చూస్తే.. ప్రియుడు ఆ ట్రాన్స్‌జెండర్‌కి హ్యాండించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్, పవన్, ఎలి నాగేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు బీఈడీ టీచర్లుగా పని చేస్తున్నారు. 2019లో వీఆర్ సిద్ధార్థలో బీఈడీ చదువుతున్న క్రమంలో వీళ్లిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచే వీళ్లిద్దరు తరచూ కలుస్తుండేవారు. చదువు పూర్తైన తర్వాత కృష్ణలంకలో ఇద్దరూ కలిసి ఒక ట్యూషన్ పాయింట్ కూడా నడిపారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకోవడంతో.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Perni Nani: చంద్రబాబు మోసగాడైతే.. పవన్ కళ్యాణ్ గజ మోసగాడు
ఈ నేపథ్యంలోనే పవన్ ట్రాన్స్‌జెండర్‌గా మారాలని ఫిక్స్ అయ్యాడు. ఢిల్లీలో ఇందుకు సంబంధించిన ఆపరేషన్ నిర్వహిస్తారని తెలిసి.. పవన్ అక్కడికి వెళ్లాడు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి.. తన ప్రియుడి కోసం ట్రాన్స్‌జెండర్‌గా మారాడు. ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత పవన్ తన పేరుని భ్రమరాంబగా మార్చుకుంది. ఇక ప్రియుడితో కలిసి సంతోషంగా బతకొచ్చని ఎన్నో కలలుకంది. కానీ.. ఇంతలోనే ఆమె ఆశలపై నాగేశ్వరరావు నీళ్లు చల్లాడు. పవన్ భ్రమరాంబగా మారాక నాగేశ్వరరావు పెళ్లికి నిరాకరించాడు. అంతేకాదు.. ఆమెని దూరంగా పెట్టసాగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన భ్రమరాంబ పోలీసుల్ని ఆశ్రయించింది. ప్రియుడి మాటలు నమ్మి లింగ మార్పిడి చేసుకున్నానని భ్రమరాంబ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. నాగేశ్వరరావు ఈ కేసు సంగతి తెలిసి పరారయ్యాడు.
Love Guru: లవ్ గురు గా మారిన బిచ్చగాడు.. ఇదెక్కడి ట్విస్ట్ సామీ
