NTV Telugu Site icon

Kurnool Tragedy: మరో 20 రోజుల్లో పెళ్లి.. కానీ ఇంతలోనే..

Tragedy In Marriage

Tragedy In Marriage

A Boy Died In Accident Just Before 20 Days Of His Marriage: ఆ యువకుడికి మరో 20 రోజుల్లోనే పెళ్లి ఉంది. కుటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ యువకుడు సైతం తన ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవడంలో బిజీ ఉన్నాడు. తన జీవితంలో రాబోయే అమ్మాయితో కొత్త ప్రయాణం మొదలుపెట్టాలన్న ఆనందంలో ఉన్నాడు. కానీ.. ఇంతలోనే విధి ఓ వింత నాటకం ఆడింది. గుర్తు తెలియని వాహనం రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మిగనూరు మండలం గుడికంబాల గ్రామానికి చెందిన హేమాద్రి, రేణుక దంపతులకు అరుణ్‌పాండు (24) అనే కుమారుడు ఉన్నాడు. ఇతను శిరుగుప్పలోని ఓ ఫర్టిలైజర్స్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు.

Adani Group: అదానీ గ్రూపులో దర్యాప్తు చేయాల్సిందే.. కాంగ్రెస్ డిమాండ్

అరుణ్‌పాండుకు మద్దికెర గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి ఖరారు చేశారు. ఆల్రెడీ నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. మరో 20 రోజుల్లోనే వీరి పెళ్లి. అందుకు సమయం దగ్గరపడుతుండటంతో.. కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అటు యువకుడు సైతం ఓవైపు తన వృత్తి పనులు నిర్వహించుకుంటూనే, మరోవైపు పెళ్లి ఏర్పాట్ల పనులు చూసుకుంటున్నాడు. ఎప్పట్లాగే గురువారం విధులు ముగించుకున్న తర్వాత.. అరుణ్‌పాండు ఇంటికి బయలుదేరాడు. అయితే.. ఇంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అతివేగంగా ఓ గుర్తు తెలియని వాహనం దూసుకొచ్చి.. పెద్దహరివాణం వద్ద అరుణ్‌పాండును ఢీకొట్టింది. ఎక్కడ తాము అడ్డంగా దొరికిపోతామేమోనన్న భయంతో.. ఆ వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. అరుణ్‌పాండు ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా, అందులో ఉన్న వాళ్లు వాహనంతో పరారయ్యారు.

Perni Nani: లోకేష్ బరితెగించి అబద్ధాలు మాట్లాడాడు.. పేర్ని నాని ఫైర్

ఈ ప్రమాదంలో అరుణ్‌పాండు తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేయగా.. వాయువేగంతో అంబులెన్స్ దూసుకొచ్చి, అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ.. ఆసుపత్రికి తరలించిన తర్వాత అతడ్ని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. దీంతో.. అరుణ్‌పాండు కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో 20 రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన తమ కుమారుడ్ని ఇలా విగతజీవిగా చూడాల్సి వస్తుందని అనుకోలేదంటూ రోదిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆ వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show comments