Site icon NTV Telugu

Blast in Crackers Factory: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు తునాతునకలైన మృతదేహాలు.. సీఎం దిగ్భ్రాంతి

Tadepalli

Tadepalli

Blast in Crackers Factory: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బాణాసంచా తయారీ యూనిట్‌లో గురువారం జరిగిన పేలుడులో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మృతిచెందిన వారిని చూసి షాక్ కి గురయ్యారు అదికారులు. పేలుడు ధాటికి మనిషి దేహాలు తునాతులకయ్యాయి. మెండెం ఒకచోటు, కాళ్లు, చేతులు మరోచోట పడటంతో ఎవరి దేహం ఎవరెవరిది అనే సందేహంలో వున్నారు అధికారులు. పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారని, దీనికి కారణం ఇంకా తెలియరాలేదని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రవి ప్రకాష్ తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన వారి సంఖ్యపై ఇంకా స్పష్టత లేదని ఆలీస్ అధికారులు తెలిపారు. “పేలుడు సంభవించినప్పుడు యూనిట్ లోపల కనీసం 10 మంది ఉన్నారు. ముగ్గురు మరణాలు ధృవీకరించబడినప్పటికీ, గాయపడిన వారి సంఖ్యను మేము ఇంకా నిర్ధారించలేదు, ”అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం కడియుద్దలో అన్నవరం అనే వ్యక్తికి చెందిన బాణసంచా కర్మాగారంగా గుర్తించారు అధికారులు.

సీఎం జగన్ దిగ్భ్రాంతి:
తాడేపల్లిగూడెంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు ఉత్తమ వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనా ప్రాంతంలో తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో బాణసంచా పేలుడు సంభవించిన ప్రాంతాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. కడియద్ద గ్రామంలో దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుందని అన్నారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులను ఘటనా స్థాలానికి పంపించి సహాయక చర్యలు తీసుకున్నామన్నారు. దీపావళి సమయంలో కూడా అధికారులు అనేక సార్లు పరిశీలించారని అన్నారు. ప్రభుత్వం తరుపున ఎంతవరకు సహాయం అందుతుందో అంతవరకు న్యాయం చేస్తామన్నారు. ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నానన్నారు. ఇటువంటి సంఘటనలు పునఃరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. క్షతగాత్రులకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఈఘటనలో ఇద్దరు మృతి చెందారని తెలిపారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ఆచూకీ లేని వారి కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారన్నారు.
చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు 10లక్షలు ఎక్సేగ్రేషియాను ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు.

ఇదిలా ఉండగా ఇదే విధమైన సంఘటనే మదురై జిల్లాలో జరిగింది. ఇందులో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు మరణించారు. అధికారిక ప్రకటన ప్రకారం, మధురై జిల్లాలోని తిరుమంగళం సమీపంలోని అజగుసిరై గ్రామంలోని బాణసంచా కర్మాగారంలో అకస్మాత్తుగా సంభవించిన పేలుడు కారణంగా ఐదుగురు కార్మికులు మరణించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. మదురై ప్రభుత్వ రాజాజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గాయపడిన కార్మికులకు ఉత్తమ చికిత్స సౌకర్యాలను అందించాలని ఆదేశించారు.
Srilaxmi Parayanam : నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇల్లు సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు నిలయమవుతుంది

Exit mobile version