రిలీజ్ కు ముందే లాభాల్లో “శ్రీదేవి సోడా సెంటర్”…!

పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఇందులో సుధీర్ బాబు ఇంతకుముందెన్నడూ లేని విధంగా డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ లో సుధీర్ లైటింగ్ సూరిబాబుగా కనిపించబోతున్నాడు. తాజాగా అమ్ముడైన ఈ సినిమా రైట్స్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.

Read Also : “సర్కారు వారి పాట” కోసం మహేష్ స్పెషల్ ప్లాన్స్

ఇటీవల కాలంలో జీ నెట్‌వర్క్ ఎక్కువగా మిడ్ రేంజ్ బడ్జెట్ చిత్రాల శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను తన అకౌంట్లో వేసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం జీ “శ్రీదేవి సోడా సెంటర్” రైట్స్ కోసం భారీగా చెల్లిందట. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ జీ కొనుగోలు చేసింది. జీ నెట్‌వర్క్ నాన్-థియేట్రికల్ రైట్స్ కోసం ఏకంగా 9 కోట్ల రూపాయలు చెల్లించింది. సుధీర్ బాబుకు మంచి మార్కెట్ ఉన్నప్పటికీ ఆయన నటించిన సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ కు ఇంత భారీ మొత్తం రావడం నిజంగా చాలా పెద్ద డీల్ అని చెప్పొచ్చు. ఇక “శ్రీదేవి సోడా సెంటర్” నిర్మాతలు ఈ డీల్ తో చిత్రం విడుదలకు ముందే లాభాలను పొందినట్టు తెలుస్తోంది. ఈ డీల్ తో నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారట.

Related Articles

Latest Articles

-Advertisement-