నెట్ ఫ్లిక్స్ లో జాక్ స్నైడర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘రెబెల్ మూన్’

ప్రపంచంలోని చాలా సినీ పరిశ్రమలు కరోనా కారణంగా దెబ్బతిన్నాయి. కానీ, హాలీవుడ్ మాత్రం ఒకింత తక్కువ నష్టమే చవి చూసింది. ఎందుకంటే, ఇతర భాషల్లోని ఏ సినిమాలు వాడుకోనంతగా ఓటీటీ ప్లాట్ పామ్స్ ని హాలీవు్డ్ చిత్రాలు ఉపయోగించుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా, నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు హాలీవుడ్ టాప్ స్టార్స్ అండ్ డైరెక్టర్స్ కి కూడా సరికొత్త వేదిక అయిపోయింది…

‘300’ లాంటి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అందించిన జాక్ స్నైడర్ కు పెద్ద తెరపై తిరుగులేదు. ఆయన బిగ్ మూవీతో బాక్సాఫీస్ వద్దకొస్తే చూసేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. అయినా స్నైడర్ నెట్ ఫ్లిక్సే ఓటు వేశాడు. అదీ ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు.

గతంలో నెట్ ఫ్లిక్స్ కోసం ‘ఆర్మీ ఆఫ్ ద డెడ్’ సినిమా రూపొందించాడు జాక్ స్నైడర్. అయితే, ఇప్పుడు ‘రెబెల్ మూన్’ అనే చిత్రంతో నెటిజన్స్ ను అలరించనున్నాడు. మన గ్యాలెక్సీ చివర్లో ఒక చిన్న కాలనీ. అందులో మనుషులు ప్రశాంతంగా జీవిస్తుంటారు. కానీ, వారిపైకి ఎక్కడ్నుంచో ఓ క్రూరుడైన నియంత తన సైన్యాన్ని పంపిస్తాడు. ఇక చేసేది లేక సదరు కాలనీ వాసులు మన గ్యాలెక్సీలోని ఇతర గ్రహాల జనాలతో చర్చలు జరిపి రాక్షస సైన్యాన్ని ఎదుర్కొంటారు. మరి ఆ కాలనీ వాసులు చివరికి ఏమయ్యారు? విలన్ పంపిన సైన్యాన్ని ‘గ్రహాంతరవాసులు’ ఎలా ఢీకొట్టారు? … నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే… ‘రెబెల్ మూన్’లో తెలుసుకోవాల్సిందే! జాక్ స్నైడర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రెబెల్ మూన్’ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించబోయేది ఎవరు? ఇంకా క్లారిటీ రాలేదు. నటీనటుటు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తారట!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-