ఎవరికీ పిలిచి రాజ్యసభ సీటు ఇచ్చే అవసరం వైసీపీకి లేదు: వైవీ సుబ్బారెడ్డి

ఎవరికీ పిలిచి రాజ్యసభ సీటు ఇచ్చే అవసరం వైసీపీకి లేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి, జగన్ భేటీలపై స్పందించారు. జూన్‌లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి సీఎం జగన్‌ నిర్ణయం మేరకు పరిశీలిస్తామన్నారు.
సీఎం జగన్ నిర్ణయం ప్రకారం ఎవరికి అవకాశం ఇస్తే వారు రాజ్యసభ సభ్యులవుతారన్నారు. పార్టీ కోసం పని చేసి.. పార్టీని బలోపేతం చేసేందుకు ఎవరు బాగా ఉపయోగపడతారో వారికి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని పేర్కొన్నారు.

Read Also: అరెస్టు చేసిన టీచర్లందరిని వెంటనే విడుదల చేయాలి: బండి సంజయ్‌

సినిమా టిక్కెట్ల వ్యవహరాన్ని సీఎంతో చర్చించేందుకుకే చిరంజీవి సీఎం జగన్‌ను కలిశారన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయనతో మాట్లాడలేదన్నారు. సనీ నటులు చిరంజీవి కూడా ఆ వార్తలను ఖండించారని పేర్కొన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో స్వామి వారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.కేసులు ఎన్ని పెరిగినా ఆన్ లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు మాత్రమే దర్శనానికి రావాలని కోరారు.

Related Articles

Latest Articles