ఆనందయ్య మందుపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆనందయ్య మందుపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు తయారీ, పంపిణీ చేపట్టాలనే ఆలోచనను విరమించుకున్నామని.. కేంద్ర సంస్థ సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదికలో ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ మందు వాడటం వల్ల కరోనా తగ్గుతుందని నిర్థారణ కూడా కాలేదని పేర్కొందని..కరోనా సమయంలో ఆనందయ్య మందు తయారు చేసి మా వంతు సహాయం చేయాలని అనుకున్నామన్నారు. కేంద్ర సంస్థ నివేదికల తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నామని..ఎవరి నమ్మకాన్ని బట్టి వారు మందు వాడవచ్చు అని ప్రభుత్వం కూడా స్పష్టం చేసిందని పేర్కొన్నారు. కోవిడ్ వచ్చిన వారు అల్లోపతి చికిత్స, ప్రోటోకాల్స్ పాటించాల్సిందేనన్నారు. కాగా ఆనందయ్య మందుకు నిన్న ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-