వైఎస్ఆర్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల అరెస్ట్‌

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ ష‌ర్మిల అరెస్ట్‌ అయ్యారు. కాసేపటి క్రితమే… వైఎస్‌ ష‌ర్మిల నిరుద్యోగ‌-నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు…అనంతరం అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ష‌ర్మిల‌ను మేడిప‌ల్లి పీఎస్‌కు త‌ర‌లించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ నేపథ్యం లో తీవ్ర ఉద్రికత్తత నెలకొంది. వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు మరియు పోలీసుల మ‌ధ్య తోపులాట‌ చోటు చేసుకుంది. చివరికి వైఎస్‌ఆర్టీపీ కార్యకర్తలను క్లియర్‌ చేసి…. వైఎస్‌ షర్మిల ను మేడిపల్లి పీఎస్‌ కు తరలించారు పోలీసులు. ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా…  వైఎస్‌ షర్మిల… ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య మైన ప్రాంతాల్లో నిరుద్యోగ దీక్ష చేశారు వైఎస్‌ షర్మిల. ఇందులో భాగంగానే ఇవాళ  బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యం లోనే వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు పోలీసులు.

-Advertisement-వైఎస్ఆర్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల అరెస్ట్‌

Related Articles

Latest Articles