వ‌న‌ప‌ర్తి జిల్లాలో వైస్ ష‌ర్మిల దీక్ష‌…

తెలంగాణ‌లో ఇటీవ‌లే కొత్త‌గా ఏర్పాటైన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.  ఈ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల నిరుద్యోగుల కోసం పోరాటం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  ప్ర‌తి మంగ‌ళ‌వారం రోజున రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు నిరుద్యోగ నిరాహ‌ర దీక్ష కొన‌సాగుతుంది.  ఈరోజు వ‌న‌ప‌ర్తి జిల్లాలోని తాడిప‌ర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు.  పీఆర్సీ ప్ర‌కారం రాష్ట్రంలో 1.91 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంద‌ని, వెంట‌నే ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్లు రిలీజ్ చేయాల‌ని వైఎస్ ష‌ర్మిల డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.  

Read: “నారప్ప” డిజిటల్ రిలీజ్ పై వెంకీ రియాక్షన్ !

వ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన కొండ‌ల్ అనే నిరుద్యోగి ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించి చివ‌ర‌కు విసుగు చెంది ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే.  నిరుద్యోగులు ఎవ‌రూ కూడా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోకూడద‌ని వారికి భ‌రోసా క‌ల్పించేందుకు, ఉద్యోగాల విష‌యంలో ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్ ష‌ర్మిల దీక్షకు శ్రీకారం చుట్టారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-