రాజ్యసభకు ఏపీ ప్రత్యేక హోదా సెగలు..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే రాజ్యసభలో ప్రత్యేక హోదాపై ఆందోళనకు దిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇవాళ రాజ్యసభలో వెల్‌లోకి దూసుకెళ్లారు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని ఆమోదిస్తూ మార్చి 11, 2014న కేంద్ర కేబినెట్‌ చేసిన తీర్మానం ఏడేళ్లు కావస్తున్నా అమలుకు నోచుకోనందున ఈ రోజు ఇతర కార్యకలాపాలను సస్పెండ్‌ చేసి.. వెంటనే ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ చేపట్టాలని రాజ్యసభ చైర్మన్‌కు రూల్‌ 267 కింద నోటీసును అందించారు విజయసాయి.. అయితే, ఈ నోటీసుపై ఇప్పటికిప్పుడు చర్చకు అనుమతించేందుకు సభాధ్యక్షులు నిరాకరించడంతో.. వెల్‌లోకి దూసుకెళ్లారు విజయసాయి.. ఇక, ఆయనతోపాటు వివిధ అంశాలపై చర్చకు పట్టుబట్టిన ఇతర పార్టీల సభ్యులు కూడా వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయడంతో.. సభలో గందరగోళం ఏర్పడింది.. మరోవైపు సభలో సాయి రెడ్డి, ఇతర పార్టీ సభ్యులు వెల్‌లో వెళ్లి ఆందోళన చేస్తున్న సమయంలో సభలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. మౌనంగా ఆ పరిణామాలను వీక్షించారు.. ఇక, రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో.. రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-