ఎంపీ ర‌ఘురామ బ‌ర్త‌ర‌ఫ్ ఖాయం.. మ‌ళ్లీ పోటీచేస్తే డిపాజిట్ కూడా రాదు..!

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్య‌వ‌హారం ఇప్పుడు లోక్‌స‌భ స్పీక‌ర్ చేతిలో ఉంది.. ఓ వైపు వైసీపీ స‌భ్యులు.. ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని ఫిర్యాదులు చేస్తుంటే.. మ‌రోవైపు.. వారి ఫిర్యాదుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ద్దు అంటూ ర‌ఘురామ.. స్పీక‌ర్‌ను కోరారు.. ఈ ప‌రిణామాల‌పై స్పందించిన వైసీపీ పార్ల‌మెంట్ చీఫ్ విప్ మార్గాని భ‌ర‌త్.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పార్లమెంట్ సభ్యత్వం బర్తరఫ్ చేయడం తథ్యం అని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.. ఆర్టికల్ 10 ప్రకారం చర్యలు త‌ప్ప‌వ‌ని.. స్పీక‌ర్‌ను ర‌ఘురామ క‌లిసినంత మాత్రం చేత బ‌ర్త‌ర‌ఫ్ నిలిచిపోద‌న్నారు. ఇక‌, రఘురామకృష్ణరాజుకు తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ లాగా పౌరుషం ఉంటే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.. రాజీనామా చేసి పోటీ చేస్తే రఘురామకు డిపాజిట్ కూడా రాద‌ని ఎద్దేవా చేశారు మార్గాని భ‌ర‌త్.. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం కారణంగానే రఘురామకృష్ణరాజు బర్తరఫ్ అని వ్యాఖ్యానించారాయ‌న‌.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-