ఏ ఎన్నికలైనా వార్‌ వన్‌ సైడే.. బాబు, లోకేష్ తట్టాబుట్టా సర్దుకోవాలి..!

ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది.. టీడీపీ డీలాపడిపోగా.. వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి… ఈ ఫలితాలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఏ ఎన్నికలు వచ్చినా వార్‌ వన్‌సైడే అన్నారు.. ఈ ఎన్నికల్లో నలబై ఏళ్ల ఇండ్రస్టీ అయినా చంద్రబాబుని తరిమి కొట్టారని సెటైర్లు వేసిన ఆమె.. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును… హైదరాబాదు ఇంటికి పరిమితం చేశారని వ్యాఖ్యానించారు… ఇకనైనా చంద్రబాబు, లోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించిన రోజా.. కుప్పం ప్రజలు సీఎం వైఎస్‌ జగన్ వెంటనే ఉన్నారని స్పష్టం చేశారు. ఢిల్లీలో చక్రం తిప్పుతాననే చంద్రబాబు…. కుప్పం మున్సిపాలిటీలు బొక్క బోర్లా పడ్డారంటూ ఎద్దేవా చేసిన రోజా… తండ్రి, కోడుకులు తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్‌కు పోండి అని వ్యాఖ్యానించారు. ఇక, ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించిన కుప్పం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే ఆర్కే రోజా.

Related Articles

Latest Articles