బాబు అప్పుడు విజ‌య‌వాడకు.. ఇప్పుడు హైద‌రాబాద్‌కు పారిపోయారు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్.. ఓటుకు నోటు కేసులో భయపడి అప్ప‌ట్లో హైద‌రాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చార‌ని.. సినిమా డైరెక్ట‌ర్ల‌ను తీసుకువచ్చి విఠాలాచార్య అట్టముక్కలు, గ్రాఫిక్స్ లు ప్రజలకు చూపించిన వ్యక్తి చంద్ర‌బాబేన్న ఆయ‌న‌.. ఇక్కడ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించ‌డంతో.. మ‌ళ్లీ హైదరాబాద్ కు పారిపోయార‌ని ఎద్దేవా చేశారు.. ఇక‌, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేశారు.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలు చేసిన వ్యక్తి చంద్ర‌బాబ‌న్న జోగి ర‌మేష్.. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో ఈడీ తన అనుచరుడిని బుక్ చేస్తే చంద్రబాబు ఎందుకు స్పందించలేదు? అని ప్ర‌శ్నించారు.. రేవంత్ రెడ్డి పై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయటం పై చంద్రబాబు నోరు విప్పాల‌ని డిమాండ్ చేసిన ఆయ‌న‌.. కేసులో కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబును కనీసం విచారణకు కూడా పిలవలేదంటే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుంది? అని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు.. మహానాడు పేరుతో చంద్రబాబు చెవులకు చిల్లులు పడేలా గంటల కొద్దీ సోది మాట్లాడార‌ని కామెంట్ చేశారు జోగి ర‌మేష్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-