వ్యాక్సిన్ ఇస్తే 10 రోజుల్లోనే పూర్తి చేస్తాం..!

కేంద్ర ప్ర‌భుత్వం మొత్తం వ్యాక్సిన్ ఇస్తే కేవలం 10 రోజుల్లోనే రాష్ట్ర‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ పూర్తి చేసే సామర్థ్యం మ‌న యంత్రాంగానికి ఉంద‌న్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు.. తాడేప‌ల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ప్రపంచమే కరోనా పై యుద్ధం చేస్తోంది.. ఇంత భయంకర పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కొందరు విమర్శలు చేయటం దుర్మార్గం అంటూ మండిప‌డ్డారు.. రికవరీలో జాతీయ సగటు 88.5 శాతంగా ఉంటే రాష్ట్రంలో 93.50 శాతం ఉంద‌ని.. విమర్శించే వాళ్లు దీనిని ఎందుకు చెప్ప‌డం లేద‌ని నిల‌దీశారు.. దేశ వ్యాప్తంగా 12 కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తే కేవలం మ‌న‌ రాష్ట్రంలోనే 55 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామ‌ని వెల్ల‌డించిన ఆయ‌న‌.. కేంద్రం మొత్తం వ్యాక్సిన్ ఇస్తే కేవలం 10 రోజుల్లో రాష్ట్రం అంతటికి వ్యాక్సిన్ వేసే సామర్థ్యం యంత్రాంగానికి ఉంద‌ని.. కానీ, వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ కేంద్రం చేతిలో ఉన్నప్పుడు రాష్ట్రం ఏం చేయగలుగుతుంది? అని ప్ర‌శ్నించారు.. కోవిడ్ పాజిటివ్ రేటు ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం 6.59 శాతంగా ఉంటే చంద్రబాబు మాత్రం 25 శాతం అని ఆరోపిస్తున్నారు అంటూ మండిప‌డ్డారు అంబ‌టి రాంబాబు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-